ధన్వంతరి జయంతి సందర్భంగా రేపు ప్రధాని మోదీ దాదాపు రూ. 12850 కోట్ల విలువైన ఆరోగ్య రంగ ప్రాజెక్టలకను ప్రారంభించనున్నారు. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో జరగనున్న కార్యక్రమం వేదికగా వీటిని వర్చువల్‌గా మోదీ ప్రారంభిస్తారు. ఈ స్కీం కింద పూర్తిగా 5 ప్రాజెక్టులకు ప్రధాని పచ్చజెండా ఊపనున్నారు. హైదరాబాద్, కాకినాడ, వాపి, బెంగళూరు, నాలాఘర్లలోని కేంద్రాల్లో వైద్య పరికరాలు, బల్క్ డ్రగ్స్‌ను ఉత్పత్తి చేస్తారు.