TG: హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (హైడ్రా) ఆధ్వర్యంలో నగరంలో కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మల్లాపూర్ నోమా ఫంక్షన్ హాల్ ఎదుట ఉన్న చెప్పుల దుకాణాన్ని కూల్చివేయడానికి అధికారులు సిద్దమయ్యారు. ఆ దుకాణానికి చెందిన తల్లీకొడుకులు తమ షాపు కూల్చివేస్తే ఎలా బతకాలంటూ అధికారులను నిలదీశారు. ‘కేసీఆర్ ఎక్కడ ఉన్నావు.. నువ్వు రావాలి’ అంటూ కంటతడి పెట్టుకున్నారు.