ప్రముఖ యూట్యూబర్ హర్షసాయి తాజాగా హైకోర్టును ఆశ్రయించాడు. ముందస్తు బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. అయితే ఇవాళ ఈ పిటిషన్పై కోర్టులో విచారణ జరగనుంది. కాగా, సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక యువతిపై అత్యాచారం చేయడమే కాకుండా ఆమె నగ్నచిత్రాలు సేకరించి ఆమెని బ్లాక్ మెయిల్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.