AP: దళిత వలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్ హత్య కేసులో వైసీపీ నేత, మాజీమంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులోని మధురైలో అతడిని అదుపులోకి తీసుకుని అక్కడి కోర్టులో హాజరుపరిచినట్లు సమాచారం. ట్రాన్సిట్ వారెంట్‌పై రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే శ్రీకాంత్ అరెస్టును పోలీసులు నిర్ధారించాల్సి ఉంది.