AP: తెలంగాణలోని సైబరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దిన ఘనత తమదే అని సీఎం చంద్రబాబు అన్నారు. ‘ముందుచూపుతో ఆనాడే సైబరాబాద్లో 8 వరుసల రోడ్లు వేశాం. శంషాబాద్ విమానాశ్రయానికి 5 వేల ఎకరాలు ఎందుకని అందరూ ప్రశ్నించారు. ఇప్పుడు చరిత్రను తిరగ రాసేందుకు అమరావతిలో సమావేశమయ్యాం. రాష్ట్ర విభజన సమయంలో అనేక ఇబ్బందులు పడ్డాం. రాజధాని రైతులను ఎంతో బాధపెట్టారు. మహిళా రైతులు వీరోచితంగా పోరాడారు’ అని సీఎం పేర్కొన్నారు.