TG: సెక్రటేరియట్లో మళ్లీ వాస్తు మార్పు చేయాలని CM రేవంత్ సర్కార్ నిర్ణయించింది. కొత్త నిర్మాణాలను ఫైనల్ చేసింది. NTR మార్గ్ ఎంట్రీ నుంచి సౌత్ ఈస్ట్ గేటు వరకు ఎదురుగా కొత్త రోడ్డు నిర్మించనుంది. గేట్ నెంబర్ 3కు ఎదురుగా హుస్సేన్ సాగర్ వైపు కొత్త గేటు పెట్టనుంది. బాహుబలి గేట్లకు ఎదురుగా ఉన్న గేటును తొలగించనున్నారు. హుస్సేన్ సాగర్ గేటు నుంచి ప్రవేశించి.. గేటు 3 నుంచి CM బయటకు వెళ్లనున్నారు.