AP: నెయ్యి కల్తీపై వాస్తవాలు తేల్చాలని కోర్టుకు వెళ్లినట్లు వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో నెయ్యి కల్తీ అయ్యిందన్న ఆరోపణలు నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని స్పష్టం చేశారు. తాను టీటీడీ ఛైర్మన్గా ఉన్న సమయంలో ఏఆర్ కంపెనీ నుంచి నెయ్యి సప్లై జరగలేదని తెలిపారు. లడ్డూ వివాదంపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలన్న సుప్రీంకోర్టు నిర్ణయాన్ని శిరసావహిస్తామని వెల్లడించారు.