TG: సీఎం రేవంత్‌పై మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి బ్రోకర్ మాటలు మాట్లాడుతున్నారని.. అబద్ధాలు, బ్లాక్మెయిల్ అనేదే ఆయన జీవితమని ఆరోపించారు. సీఎం పదవి చేపట్టినా పద్ధతి మారడం లేదని విమర్శించారు. రుణమాఫీ పూర్తి అయ్యేవరకు వదిలే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు.