AP: ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు ఇంటి వద్ద కొండచిలువ పాము కలకలం రేపింది. ఓ జంతువును మింగి మీడియా పాయింట్ వద్ద కొండచిలువ మృతిచెందినట్లు గుర్తించారు. వెంటనే సీఎం భద్రతా సిబ్బందికి సమాచారమిచ్చారు. కొండచిలువను అక్కడి నుంచి తొలగించేందుకు ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.