TG: హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో విమానాన్ని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు మళ్లించారు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన విమానం ఒంటిమిట్ట సమీపంలోకి వెళ్లిన తర్వాత టెక్నికల్ ఇష్యూ బయటపడింది. దీంతో విమానయాన శాఖ అధికారులు వెంటనే చర్యలు చేపట్టారు. అయితే ప్రయాణికులు సురక్షితంగా ఉన్నట్లు విమాన సిబ్బంది తెలిపారు.