AP: సనాతన ధర్మం పాటించే వ్యక్తులు ఇతర మతాలను గౌరవిస్తారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ పాలనలో ఆలయాల్లో తప్పు జరిగిందని చెబితే అపహాస్యం చేసేవారని అన్నారు. ఈ దేశంలోని సగటు హిందువుకు వేరే మతం, వ్యక్తి మీద ద్వేషం ఉండదన్నారు. కానీ రాజకీయ ప్రయోజనాల కోసం సాటి హిందువులు.. తోటి హిందువులనే తిడుతున్నారని విమర్శించారు. వైసీపీ నాయకులు సనాతన ధర్మం జోలికి రావద్దని హెచ్చరించారు.