AP: ఏలూరు జిల్లాలో జరిగిన దీపం-2 కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ సొంత సోదరి తన ప్రాణాలకు రక్షణ కావాలంటోంది. షర్మిలకు రక్షణ కల్పించే బాధ్యత కూటమి ప్రభుత్వానిదని హామీ ఇచ్చారు. ఏపీసీసీ చీఫ్ షర్మిల రేపు రాజకీయంగా తమపై విమర్శలు చేసినా కూడా ఆమెకు అండగా ఉంటామని తెలిపారు.