TG: తిరుమలలో శ్రీవారిని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎన్.రాజేశ్వర్ రావు ఆదివారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారి ఆలయం వద్దకు చేరుకున్న న్యాయమూర్తికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. ఆయనకు రంగనాయక మండపంలో వేదపండితులు ఆశీర్వచనం చేయగా, అధికారులు లడ్డూప్రసాదాలు అందజేశారు.