శ్రీలంక ప్రధాని పదవికి గుణవర్దన రాజీనామా చేశారు. శనివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో నేషనల్ పీపుల్స్ పవర్ నేత అనురకుమార దిసనాయకే విజయం సాధించడంతో గుణవర్దన రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాగా గుణవర్దన 2022 జూలై నుంచి శ్రీలంక ప్రధానిగా ఉన్నారు. అయితే కొత్త అధ్యక్షుడు ఎన్నికైనందున తాను ఆ పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. కాగా శనివారం జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో దిసనాయకే విజయం సాధించిన సంగతి తెలిసిందే.