శ్రీలంక కొత్త అధ్యక్షుడిగా నియమితులైన దిసనాయకేకు CPI జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా శుభాకాంక్షలు తెలిపారు. ‘దిసనాయకే విజయం దక్షణాసియా, ప్రపంచ రాజకీయ గమనంపై ప్రభావం చూపనుంది. దిసనాయకే నాయకత్వంలో శ్రీలంక ప్రస్తుత ఆర్థిక పరిస్థితిని అధిగమించడమే కాకుండా దేశంలోని మైనారిటీల హక్కులకు కాపాడుతుందనే నమ్మకం కలిగింది. కొత్తగా ఎన్నికైన శ్రీలంక అధ్యక్షుడికి CPI తరపున శుభాకాంక్షలు’ అని ట్వీట్ చేశారు.