ప్రశాంతి ఎక్స్ప్రెస్ రైలులో సాంకేతలోపం తలెత్తింది. దీంతో ఒడిస్సాలోని బ్రహ్మపూర్ సమీపంలో ఆగిపోయింది. అదే రైలులో భారత మాజీ ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు ప్రయాణిస్తున్నారు. లోకోలో సాంకేతిక లోపం ఏర్పడినట్లు లోకో పైలెట్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వేరే లోకోను ఏర్పాటు చేశారు. అయితే ఈ ప్రక్రియ పూర్తి కావడానికి బులుగాం స్టేషన్లో దాదాపు 45 నిమిషాల పాటు రైలు ఆగింది.