TG: మూసీలో కూల్చివేతలపై అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయాలని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘అన్ని పక్షాలతో మాట్లాడిన తర్వాతే కూల్చివేతలపై ముందుకెళ్లాలి. హైడ్రోజన్ బాంబులా హైడ్రా తయారైంది. సుందరీకరణ పేరుతో మూసీ నదిలో పేదల రక్తం, కన్నీళ్లను పారిస్తున్నారు. రాత్రికి రాత్రే ఇళ్లు కూల్చేస్తే పేదలు ఏం చేయాలి. సీఎం రేవంత్ తుగ్లక్ పనుల వల్ల HYD ఇమేజ్ దెబ్బతింటోంది’ అని మండిపడ్డారు.