GNTR: హమాలీల కూలి రేట్ల జీవో వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ సివిల్ సప్లయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన, ఉప కార్యదర్శులు వెంకటసుబ్బయ్య, అంజిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెనాలిలో రాష్ట్ర పౌరసరఫరాల శాఖామంత్రి నాదెండ్ల మనోహర్‌ను కలిసి శనివారం సమస్యల వినతిపత్రం అందించారు. మంత్రి మాట్లాడుతూ.. కార్మిక సమస్యలు వారం రోజుల్లో సమస్య పరిష్కరిస్తామన్నారు.