అక్రమ వలసలను నివారించేందుకు అమెరికా సరిహద్దుల్లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తామని కమలా హారిస్ అన్నారు. అమెరికా ఇమ్మిగ్రేషన్ వ్యవస్థను సరి చేస్తానని వెల్లడించారు. దీనిపై స్పందిస్తూ.. నాలుగేళ్లుగా సరిహద్దు వద్దకు వెళ్లకుండా హారిస్ ఏం చేశారని డొనాల్డ్ ట్రంప్ ప్రశ్నించారు. చిన్న పట్టణాలన్నింటినీ ఆమె శరణార్థుల శిబిరాలుగా మార్చారని.. హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా పట్టించుకోలేదని మండిపడ్డారు.