AP: విద్యార్థులను ఉద్దేశించి మంత్రి నారా లోకేశ్ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘విద్యార్థి మిత్రులారా.. వైసీపీ ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల మొత్తం రూ.3500 కోట్లు చెల్లించకుండా మిమ్మల్ని మోసం చేసింది. ఈ సమస్య పరిష్కరించేందుకు క్యాబినెట్ మంత్రివర్గ సహచరులతో సంప్రదింపులు జరుపుతున్నా. మీకు హామీ ఇస్తున్నా. అతిత్వరలోనే మీరు శుభవార్త వింటారు. మీ వెంట నేనున్నా’ అని భరోసా కల్పించారు.