అక్టోబర్ చివరి వారం నుంచి ఢిల్లీలో కాలుష్యం భారీగా పెరిగిపోయింది. దీని ప్రభావం నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్‌లో కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో దీపావళి సెలవుల తర్వాత తెరిచిన పాఠశాలలు మళ్లీ మూతపడే అవకాశం ఉన్నాయి. విషపూరితమైన గాలిని పీల్చడం వల్ల ప్రమాదం పొంచి ఉంటుందని.. ఇప్పటికే చాలా కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నాయి. స్కూళ్లను కూడా వారం రోజుల పాటు మూసేయాలని అధికారులు ప్లాన్ చేస్తున్నారు.