మార్కెట్లో కనిపించే వాటర్ యాపిల్స్ మీరు చూసే ఉంటారు. వీటిని వైట్ జామున్ అని కూడా పిలుస్తారు. ఈ పండ్లను తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో విటమిన్-ఎ, సి పుష్కలంగా ఉంటాయి. వాటర్ యాపిల్ రోగనిరోధక శక్తిని పెంచుతుంది. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది. శరీర బరువు తగ్గేందుకు దోహదపడుతాయి.