ఇప్పటికే వక్ఫ్ సవరణ బిల్లు -2024కు దేశంలోని చాలా ముస్లిం సంస్థలు తమ మద్దతును తెలిపినట్లు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. స్క్రూటినీ కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ విడుదల చేసిన వక్ఫ్ బిల్లు ముసాయిదాపై పెద్ద సంఖ్యలో సూచనలు వచ్చినట్లు తెలిపారు. వక్ఫ్ బిల్లు అమల్లోకి వస్తే ముస్లింల భూములు కబ్జాల బారినపడతాయని జరుగుతున్న ప్రచారం అవాస్తవమని పేర్కొన్నారు. ఆ దుష్ప్రచారాన్ని వెంటనే ఆపేయాలని హెచ్చరించారు.