TG: జనాలు ఊరికే వస్తే దేనిని కూడా వదలరని మరోసారి నిరూపితమైంది. తాజాగా మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ఖమ్మం నుంచి వరంగల్ వైపు చేపల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో లారీ బోల్తా పడటంతో చేపలన్నీ రోడ్డుపై పడిపోయాయి. ఇంకేముందీ బతికున్న చేపల కోసం ప్రజలు ఎగబడ్డారు. దొరికిన చేపలను దొరికినట్లు తీసుకుని వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.