TG: సింగరేణి కార్మికులకు ఇచ్చే లాభాల్లో కోత విధించడాన్ని మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. మొత్తం రూ.4,701 కోట్లలో 33 శాతం బోనస్‌గా ప్రకటించాలని డిమాండ్ చేశారు. దసరా సందర్భంగా సింగరేణి కార్మికులకు తీపి కబురుకు బదులు.. చేదు కబురు చెప్పారని ధ్వజమెత్తారు. లాభాల వాటాలో 50 శాతం కోత విధిస్తూ కార్మికులకు చేసిన అన్యాయాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. కార్మికులు చేసిన కష్టానికి ఫలితం ఇవ్వకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు.