తిరుమల లడ్డూ అపవిత్రంపై వస్తున్న అనుమానాలను నివృత్తి చేస్తూ టీటీడీ ‘X’ వేదికగా స్పందించింది. ప్రసాదాల పవిత్రతను పునరుద్ధరించామంటూ పోస్టు చేసింది. గతంలో ఉపయోగించిన నెయ్యి, ప్రస్తుతం వినియోగించిన నెయ్యి వివరాలను వెల్లడించింది. నెయ్యి కల్తీని నిర్ధారించిన ల్యాబ్ రిపోర్ట్‌ను పోస్టు చేసింది. నందిని డెయిరీ నెయ్యి రిపోర్టునూ పక్కనే పోస్టు చేసింది. లడ్డూ నాణ్యతపై భక్తుల్లో ఉన్న అపోహలు తొలగించేందుకు ప్రయత్నించింది.