TG: మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టు పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను మభ్యపెడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. ఇళ్లు కూల్చింది ఒక చోటైతే పాదయాత్ర చేసేది మరో చోటనా అంటూ ‘ఎక్స్’ వేదికగా నిలదీసింది. మూసీ సుందరీకరణ పేరుతో పేదలను రేవంత్ సర్కార్ నిండా ముంచుతుందని మండిపడింది. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి తుగ్లక్ పాలన చేస్తున్నాడని విమర్శించింది.