TG: 2018 నుంచి కాంగ్రెస్ ప్రమాణస్వీకారం చేసిన రోజు వరకు తీసుకున్న రుణాలు మాఫీ చేస్తామని చెప్పినట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గుర్తు చేశారు. మొత్తం 42 లక్షల మంది రైతు రుణాలు తీసుకున్నారని, తాము చేసిన రుణమాఫీ ప్రతీదీ రికార్డుల్లో ఉన్నాయన్నారు. తెల్లకార్డులు ఉన్నవారికి రుణమాఫీ జరిగిందని, రూ.2 లక్షల కంటే ఎక్కువ ఉన్నవారికి కూడా రుణమాఫీ చేస్తామని చెప్పారు. నష్ట పరిహారం కోసం ఎకరాకు రూ.10 వేలు ఇస్తున్నామని ప్రకటించారు.