AP: తిరుమల లడ్డూపై భయంకరమైన ఆరోపణలు చేశారని మాజీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు. మాజీ సీఎం జగన్ను అభాసుపాలు చేయాలనే ఇలా చేస్తున్నారని ధ్వజమెత్తారు. ‘రాజకీయ కక్షతోనే కావాలనే లడ్డూ కల్తీ వివాదాన్ని తెరమీదకు తెచ్చారు. 2 నెలలపాటు రిపోర్టును ఎందుకు బయటపెట్టలేదు. మొదట వనస్పతి ఆయిల్ కనిసిందని టీటీడీ ఈవో ప్రకటించారు. ఇప్పుడు మళ్లీ సీఎం చంద్రబాబు చెప్పిన అంశాన్ని సమర్థించటానికి ఈవో కష్టపడుతున్నారు’ అని దుయ్యబట్టారు.