కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ నమోదైంది. ఇటీవల అమెరికా పర్యటనలో ఒక వర్గానికి వ్యతిరేకంగా చేసిన వ్యాఖ్యలకుగానూ కర్ణాటకలోని బీజేపీ నేతలు రాహుల్పై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. నేతల ఫిర్యాదు మేరకు రాహుల్పై బెంగళూరులోని హై గ్రౌండ్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కాగా, రాహుల్ గాంధీ ఈనెల ప్రారంభంలో అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే.