TG: కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతులంటే లెక్కేలేదని మాజీమంత్రి హరీశ్ రావు అన్నారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో BRS మహాధర్నాలో పాల్గొని మాట్లాడారు. ‘పంద్రాగస్టులోగా రుణమాఫీ చేస్తామన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని చెప్పి చేయలేదు. దసరాలోపు రైతుబంధు నిధులు విడుదల చేయాలి. లేదంటే దసరా తర్వాత ఢిల్లీకి వెళ్లి రాహుల్ గాంధీ ఇంటిని ముట్టడిస్తాం. కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ఏమైందని నిలదీస్తాం’ అని తెలిపారు.