AP: అమరావతి రాజధాని నిర్మాణం 2.O ప్రారంభమైంది. రాజధాని నిర్మాణ పనుల పునః ప్రారంభానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో సీఆర్డీఏ కార్యాలయ పనులను సీఎం చంద్రబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. తుళ్లూరు మండలం ఉద్ధండరాయనిపాలెంలో పనులను మొదలుపెట్టారు. కాగా, గత ప్రభుత్వ హయాంలో రాజధానిలో నిర్మాణ పనులు నిలిచిపోయిన విషయం తెలిసిందే.