TG: రాజకీయ లబ్ది కోసమే బీఆర్ఎస్ కుట్రలు చేస్తుందని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులు ప్రభుత్వంపై తప్పుడు ప్రాచారం చేస్తున్నారని, పదేళ్ల పాలనలో రూ. 7లక్షల కోట్ల అప్పులు చేశారని పేర్కొన్నారు. ఆరు గ్యారెంటీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నామని, ప్రభుత్వాన్ని విమర్శించే నైతిక హక్కు వారికి లేదని పేర్కొన్నారు.