ఉక్రెయిన్పై యుద్ధానికి మద్దతుగా రష్యాకు ఉత్తర కొరియా మరో 1500 మంది సైనికులను తరలించిందని దక్షిణ కొరియా ఇంటెలిజెన్స్ చీఫ్ వెల్లడించారు. డిసెంబర్ నాటికి 10 వేల మంది సైన్యాన్ని పంపాలని ప్యాంగ్యాంగ్ ప్రణాళిక రచిస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఇప్పటికే ఉత్తర కొరియా ఈనెలలో 1,500 మందిని ప్రత్యేక దళంగా పంపినట్లు దక్షిణ కొరియా వెల్లడించింది. 2023 ఆగస్టు నుంచి 13 వేల ఆయుధాలను పంపిందని తెలిపింది.