TG: దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 90% రైల్వేలైన్ల విద్యుదీకరణ జరుగుతుందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ‘వరంగల్లో రూ.650కోట్లతో రైల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తాం. గతంలో ఎన్నడూ లేనివిధంగా ద.మధ్య రైల్వే బడ్జెట్ను పెంచాం. రూ.720కోట్లతో చేపట్టిన సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ పనులు వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి పూర్తవుతాయి. యాదాద్రి వరకు MMTSను పొడిగించాలని నిర్ణయం తీసుకున్నాం’ అని పేర్కొన్నారు.