AP: రాష్ట్రాన్ని గాడిలో పెడుతున్న తమపై విమర్శలు చేయడం సరికాదని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు. రెవెన్యూశాఖలో ఫిర్యాదులపై విచారణ జరుగుతోందని తెలిపారు. పార్టీకోసం పని చేసిన వారికి కచ్చితంగా పదవులు లభిస్తాయన్నారు. జిల్లా పునర్విభజనపై ఎలాంటి కసరత్తు చేయట్లేదని పేర్కొన్నారు.