TG: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తమ్ముడు శ్రీకాంత్ గౌడ్‌కు జైలు శిక్ష పడింది. MBNR క్రిస్టియన్ పల్లిలోని సర్వే నెంబర్ 523లో అక్రమాలకు పాల్పడిన కేసులో శ్రీకాంత్ గౌడ్ A4 నిందితుడిగా ఉన్నారు. సాక్ష్యాలను పరిశీలించిన మెజిస్ట్రేట్ కోర్టు.. శ్రీకాంత్ గౌడ్‌కు 14 రోజుల జైలు శిక్ష విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో శ్రీకాంత్ గౌడ్‌ను మహబూబ్‌నగర్ జిల్లా జైలుకు తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.