స్పేస్ఎక్స్ సంస్థ ద్వారా ఎలాన్‌మస్క్ అంతరిక్షరంగంలో దూసుకెళ్తున్నారు. అయితే మస్క్ వినూత్న ఆలోచనలను ఇస్రో ఛైర్మన్ ఎస్ సోమనాథ్ కొనియాడారు. ‘స్పేస్ఎక్స్ ఇటీవల చాప్‌స్టిక్స్ తరహాలోని మెకానికల్ ఆర్మ్స్‌తో స్టార్‌షిప్ రాకెట్ బూస్టర్‌ను పట్టుకోగలిగింది. మస్క్ పనితీరు నుంచి మనమంతా ప్రేరణపొందాం. దానివల్లే అంతరిక్ష రంగం ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఆకర్షిస్తోంది’ అని వెల్లడించారు.