ఈరోజు భారత చెస్ చరిత్రలో నిలిచిపోయే రోజని సీఎం చంద్రబాబు అన్నారు. చెస్ ఒలింపియాడ్ 2024లో డబుల్ గోల్డ్ మెడల్స్ సాధించటంతో భారత చెస్ జట్లు ఛాంపియన్లుగా నిలిచాయని పేర్కొన్నారు. ఛాంపియన్లు పి.హరికృష్ణ, హారిక ద్రోణవల్లి చరిత్ర సృష్టించటంలో పెద్ద పాత్ర పోషించారని కొనియాడారు. ఈ మేరకు సీఎం ట్వీట్ చేశారు. కాగా, 45వ ఫిడే చెస్ ఒలింపియాడ్‌లో భారత పురుషులు, మహిళల జట్లు స్వర్ణం గెలుచుకున్నాయి.