బెంగళూరులో నిర్మాణంలో ఉన్న భవనం కూలిన ఘటనలో మృతుల సంఖ్య ఎనిమిదికి చేరింది. గల్లంతైన ఇద్దరి కోసం శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతోంది. ఘటనాస్థలంలో NDRF, SDRF బృందాల రెస్య్కూ ఆపరేషన్ జరుగుతోంది. ఘటనాస్థలాన్ని పరిశీలించిన సీఎం సిద్ద రామయ్య.. బాధితులను ప్రభుత్వం అన్నివిధాలా ఆదుకుంటుందని హామీ ఇచ్చారు. కాగా, మృతుల్లో ఎక్కువ మంది బిహార్‌కు చెందిన వారు ఉన్నట్లు గుర్తించామని అక్కడి అధికారులు తెలిపారు.