భారత స్వాతంత్య్ర ఉద్యమ చరిత్రలో భగత్ సింగ్ ఒక ముఖ్యమైన వ్యక్తి. భగత్ సింగ్ 12 ఏళ్ల వయస్సులోనే బ్రిటిష్ సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాట యోధుడిగా మారారు. 1919 ఏప్రిల్ 13న జరిగిన జలియన్ వాలా బాగ్ ఊచకోత అతడిని రగిలించింది. భగత్‌సింగ్ అంతిమ లక్ష్యం ఒకటే.. అది బ్రిటిష్ బానిస సంకేళ్లను తెంచడం. భగత్ సింగ్ ఇంక్విలాబ్ జిందాబాద్ అనే నినాదం ఎత్తుకొని జాతీయోద్యమాన్ని ఉర్రూతలూగించిన వీరుడు.