ఇటీవల కర్ణాటక రాజధాని బెంగళూరులో ఓ యువతిని ముక్కలుగా నరికి, రిఫ్రిజిరేటర్లో కుక్కిన ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో అనుమానితుడు పశ్చిమ బెంగాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారని కర్ణాటక హోంమంత్రి జి.పరమేశ్వర్ వెల్లడించారు. అతడిని అరెస్టు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.