TG: ఆక్రమణదారులే హైడ్రాను చూసి భయపడుతారు.. బుల్డోజర్లను రెడీ చేశాం.. ఎవరు అడ్డం వస్తారో రండి చూద్దాం అని సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. HYD ప్రతిష్ట దెబ్బతీసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని, తమ ప్రభుత్వం అలాంటి వారి భరతం పడుతుందన్నారు. పేదలు ఎవరైనా ఫాంహౌజ్‌లు కట్టించుకుంటారా అని ప్రశ్నించారు. హైడ్రా అనగానే కేటీఆర్, హరీష్ రావు, ఈటల బయటకొచ్చారని విమర్శించారు. మూసీ మురికిలో ఉన్న పేదలను ఆదుకుంటామని భరోసా ఇచ్చారు.