TG: పరీక్షలు ఆపాలి, ప్రభుత్వంపై బురద చల్లడమే బీఆర్ఎస్ అంతిమ లక్ష్యమని ఎంపీ చామల కిరణ్కుమార్ రెడ్డి అన్నారు. గ్రూప్-1 విద్యార్థుల ఆశయాలు నెరవేరకుండా చూడాలని విపక్షం కుట్ర చేస్తోందని ఆరోపించారు. పరీక్షలు వాయిదా వేయాలంటున్న బీఆర్ఎస్.. మళ్లీ పరీక్షలు పెట్టలేదని విమర్శలు చేస్తుందన్నారు. జీతాలు ఇవ్వాల్సి వస్తుందని ఉద్యోగాలు భర్తీ చేయలేదని విమర్శిస్తారని పేర్కొన్నారు.