సౌదీ అరేబియా ప్రపంచంలోనే అతిపెద్ద భవనాన్ని నిర్మిస్తోంది. న్యూ మురబ్బా కంపెనీ ది ముకాబ్ పేరుతో రియాద్‌లో నిర్మాణం చేపడుతోంది. 400 మీటర్ల ఎత్తుతో క్యూబ్ ఆకారంలో ది ముకాబ్ నిర్మితమవుతోంది. సౌదీ విజన్ 2030లో భాగంగా 50 బిలియన్ డాలర్ల ఖర్చుతో నిర్మాణం జరుగుతోంది.