TG: సీఎం రేవంత్ రెడ్డి సొంత మంత్రులతో పాటు ప్రతిపక్ష నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నారని మాజీమంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ విసిరారు. దమ్ముంటే తన సవాల్ స్వీకరించి బహిరంగంగా ఫోన్ ట్యాప్ చేయడం లేదని ప్రకటించాలన్నారు. రేవంత్‌కు దమ్ముంటే తనతోపాటు బహిరంగా కెమెరాల ముందు లై డిటెక్టర్ పరీక్షకు సిద్ధం కావాలన్నారు.