ఆర్మీ అధికారికి కాబోయే భార్యను పోలీస్ స్టేషన్లో లైంగికంగా వేధించిన ఘటనను ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్ ఖండించారు. రాష్ట్రంలోని మహిళలకు.. చివరకు పోలీస్ స్టేషన్లో కూడా రక్షణ కరువైందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయంటూ అధికార బీజేపీ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాజ్భవన్లో ప్రభుత్వ ఉద్యోగులను కొట్టడం బాధకరమని పేర్కొన్నారు.