పాకిస్థాన్ మరోసారి భారత్‌పై తన అక్కసు వెళ్లగక్కింది. లాహోర్‌లో కాలుష్యానికి భారత్ కారణమంటూ విమర్శలు చేసింది. లాహోర్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) ఏకంగా 1,900 పాయింట్లు నమోదైంది. దీనిపై ఆ దేశ మంత్రి మరియం ఔరంగజేబ్ మాట్లాడుతూ.. లాహోర్‌లో వాయు కాలుష్యం పెరగడానికి భారత దేశంలోని పంజాబ్ నుంచి వీచే గాలులే కారణమని ఆరోపించారు. పొరుగు దేశం నుంచి కలుషిత గాలి అక్కడికి చేరుకుని ఏక్యూఐ పెరిగిందన్నారు.