TG: పత్తి రైతుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కొత్తసేవలను ప్రారంభించింది. రైతుల సౌకర్యార్థం వాట్సాప్ సేవలను మొదలు పెట్టింది. వాట్సాప్ నంబర్ 8897281111 ద్వారా పత్తి అమ్మకం, కొనుగోళ్లకు సంబంధించిన వివరాలను అందించేందుకు వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సిద్ధమయింది. పత్తి విక్రయాల్లో ఎలాంటి జాప్యం జరగవద్దని, రైతులకు ఎలాంటి సమస్యలు ఉన్నా వాట్సాప్ ద్వారా సమాచారమిస్తే మార్కెటింగ్ శాఖ వెంటనే చర్యలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు.