ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ రష్యా పర్యటనకు వెళ్లనున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ ఆహ్వానం మేరకు 16వ బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు ఆ దేశానికి వెళ్తున్నారు. ఈ నెల 22, 23 తేదీల్లో బ్రిక్స్ సభ్యదేశాల అధినేతలతో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. గ్లోబల్ డెవలప్మెంట్, భద్రతతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న కీలకమైన సమస్యలపై ఈ సమ్మిట్లో చర్చించనున్నారు.